ఉంగుటూరు తాహశీల్దార్ కార్యాలయంలొ శుక్రవారం అన్ని రాజకీయ పక్షాల సమావేశం జరిగింది. ఈ సంధర్భంగా బూత్ లెవైల్ ఏజెంట్ల నియామకంపై రాష్ట్ర ఐటీడీపీ కార్యనిర్వహక కార్యదర్శి ఉండవల్లి బాలానందం వివరించారు. రాజకీయ పక్షాలు బూత్ లెవెల్ ఏజెంట్లను బిఎల్ఎ ఫాం-2 ద్వారా నియమించుకోవలసిందిగా తెలియజేసియున్నారు. గతంలో ఉన్న ఫాంను భారత ఎన్నికల సంఘం నవీకరించినందున ఒక పొటో, ఆధార్, ఓటరు కార్డు జతపరచి వలసి ఉందన్నారు.