ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలం యర్రమళ్ల సబ్‌స్టేషన్ పరిధిలో శనివారం విద్యుత్ సరఫరాకు అంతరాయం కలవనుంది. మరమ్మతుల నిమిత్తం ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు యర్రమళ్ల, గుళ్లపాడు, నీలాద్రిపురం, నాచుగుంట, కొత్తగూడెం గ్రామాలతో పాటు ఉంగుటూరు పరిశ్రమలకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు ఏఈ శ్రీరామ్ తెలిపారు. ఈ అంతరాయానికి వినియోగదారులు సహకరించాలని ఆయన కోరారు.