గొల్లగూడెం ఏఈ వేణు తెలిపిన వివరాల ప్రకారం, ఉంగుటూరు మండలం ఏ. గోకవరం విద్యుత్ సబ్‌స్టేషన్ పరిధిలో శుక్రవారం విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడనుంది. లైన్లకు అడ్డుగా ఉన్న చెట్ల కొమ్మలను తొలగించే పనుల కారణంగా ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయబడుతుంది. వ్యవసాయ ఫీడర్లకు ఉదయం 5 నుంచి 9 గంటల వరకు, ఆ తర్వాత మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం 6 గంటల వరకు విద్యుత్ సరఫరా అందుబాటులో ఉంటుందని ఆయన పేర్కొన్నారు.