AP: విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల నేపథ్యంలో గురువారం అత్యవసర బోర్డు సమావేశం నిర్వహించారు. పెండింగ్‌లో ఉన్న సుమారు 20 అజెండాలపై చర్చించి ఆమోదం తెలిపారు. దసరా వేడుకలకు రాష్ట్రపతి, కేంద్ర మంత్రులతో పాటు 5 నుంచి 6 రాష్ట్రాల సీఎంలు హాజరుకానున్న నేపథ్యంలో ఏర్పాట్లపై దృష్టి సారించారు. భక్తులకు వేగంగా దర్శనం కల్పించేందుకు హోల్డింగ్ పాయింట్లు, క్యూ లైన్లలో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. వీఐపీ దర్శన వేళలు, వాహనాల రాకపోకలు, వెహికల్ పాస్‌ల జారీకి సమగ్ర రూట్‌మ్యాప్ సిద్ధం చేస్తున్నారు.