ఉపాధి హామీ బకాయిలపై వైసీపీ ఆందోళన

0చూసినవారు
ఉపాధి హామీ బకాయిలపై వైసీపీ ఆందోళన
ఉపాధి హామీ పథకం కూలీలకు నెలల తరబడి పెండింగ్‌లో ఉన్న వేతన బకాయిలను వెంటనే చెల్లించాలని వైఎస్సార్‌సీపీ పంచాయతీరాజ్‌ విభాగం డిమాండ్‌ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఈ సమస్యపై సోమవారం ఆందోళన చేసింది. వైఎస్సార్‌సీపీ శ్రేణులు, నాయకులు అన్ని జిల్లాల కలెక్టరేట్‌ల వద్ద శాంతియుతంగా ఆందోళన చేసి, ప్లకార్డులు పట్టుకుని నిరసన తెలిపారు. అనంతరం.. జిల్లా కలెక్టర్లకు వినతిపత్రాలు సమర్పించారు. మంత్రి పెమ్మసాని ఉపాధి హామీ బకాయిలు విడుదల చేసినందుకు కేంద్రానికి కృతజ్ఞతలు తెలిపినప్పటికీ, ఆ డబ్బును రాష్ట్రంలోని ఒక్క ఉపాధి కూలీ ఖాతాలోకైనా జమచేశారా అని ప్రశ్నించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్