స్వయం సహాయక బృందాల మహిళలకు ప్రోత్సాహం: మంత్రి కొండపల్లి

33433చూసినవారు
స్వయం సహాయక బృందాల మహిళలకు ప్రోత్సాహం: మంత్రి కొండపల్లి
AP: స్వయం సహాయక బృందాల (SHG) మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దాలని, సకాలంలో బ్యాంకు రుణాలు అందించే విధంగా చర్యలు చేపట్టాలని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అధికారులను ఆదేశించారు. ఇప్పటివరకు 39 వేల మందికిపైగా మహిళలు రూ.578 కోట్లతో వ్యాపారాలు ప్రారంభించారని వెల్లడించారు. 2026 మార్చి నాటికి స్వయం సహాయక బృందాలకు రూ.32,322 కోట్ల రుణాలు అందజేయాలన్నారు. అలాగే రైతు ఉత్పత్తిదారుల సంఘాలను బలోపేతం చేయాలని, వాటికి మద్దతు ఇవ్వాలని సూచించారు.

సంబంధిత పోస్ట్