గిట్టుబాటు ధర వచ్చే వరకు పంట ఉత్పత్తుల నిల్వకు ప్రోత్సాహం

35237చూసినవారు
గిట్టుబాటు ధర వచ్చే వరకు పంట ఉత్పత్తుల నిల్వకు ప్రోత్సాహం
AP: బహిరంగ మార్కెట్‌లో రైతులకు గిట్టుబాటు ధర వచ్చేవరకు పంట ఉత్పత్తులను నిల్వ చేయడాన్ని ప్రోత్సహించేందుకు గోదాముల నియంత్రణ, అభివృద్ధి సంస్థ కృషి చేస్తోంది. నిల్వ చేసిన సరుకుపై పూచీకత్తు లేకుండా రైతుకు గరిష్టంగా రూ.75 లక్షల వరకు రుణాలు ఇవ్వనుంది. ఈ-కిసాన్ ఉపజ్ నిధి పథకం ద్వారా రైతులు ఆరు నెలల వరకు ఏదైనా నమోదిత గిడ్డంగిలో పంట నిల్వ చేసుకునే వెసులుబాటు ఉంటుంది. ఆ బాండు ఆధారంగా 7 శాతం వడ్డీకి పూచీకత్తు లేకుండా వెంటనే రుణం లభిస్తుంది.

సంబంధిత పోస్ట్