పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో, ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ కీలక ప్రకటన చేశారు. ఇరాన్-ఒమన్ మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం, హర్ముజ్ జలసంధి గుండా ప్రయాణించే నౌకలకు ఇకపై ఉచిత ప్రయాణం ఉండదని, రుసుము చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. ఈ అంశంపై ఇరు దేశాలు త్వరలోనే నిర్ణయం తీసుకోనున్నాయి. ఈ జలసంధి నిర్వహణ మారనుందని, ఇది పూర్తిగా ఇరాన్, ఒమన్ సార్వభౌమాధికారం కిందకు వస్తుందని, ప్రయాణించే నౌకలు రుసుము చెల్లించాల్సి ఉంటుందని అరాగ్చీ అన్నారు. హర్ముజ్ జలసంధి భద్రత, నియంత్రణపై ఇరు దేశాలు త్వరలో సంయుక్త కార్యాచరణ ప్రకటిస్తాయి.