రెండు రోజుల్లో నిశ్చితార్థం.. రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి

40217చూసినవారు
TG: ఖమ్మం జిల్లా ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని మద్దులపల్లి గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన గొడ్డు గొర్ల ప్రసాద్ మంగళవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. స్థానికుల వివరాల ప్రకారం.. ప్రసాద్ రోడ్డు దాటుతుండగా, గుర్తుతెలియని కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ప్రసాద్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా, ఏప్రిల్ 2న ప్రసాద్‌కు నిశ్చితార్థం జరగాల్సి ఉండగా, అంతలోనే ఈ దుర్ఘటన చోటుచేసుకోవడంతో కుటుంబంలో విషాదం నెలకొంది.

సంబంధిత పోస్ట్