శ్రీలంకపై టి20 సిరీస్‌ 'క్లీన్‌స్వీప్‌' చేసిన ఇంగ్లండ్‌

2560చూసినవారు
శ్రీలంకపై టి20 సిరీస్‌ 'క్లీన్‌స్వీప్‌' చేసిన ఇంగ్లండ్‌
ఇంగ్లండ్ జట్టు శ్రీలంకపై టి20 సిరీస్‌ను 3-0తో క్లీన్‌స్వీప్ చేసింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా మంగళవారం జరిగిన ఆఖరి టి20లో ఇంగ్లండ్ 12 పరుగుల తేడాతో శ్రీలంకను ఓడించింది. మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 9 వికెట్లకు 128 పరుగులు చేసింది. సామ్ కరన్ 58 పరుగులతో రాణించగా, శ్రీలంక బౌలర్లలో దుశ్మంత చమీరా 5 వికెట్లు తీశాడు. అనంతరం ఛేదనలో శ్రీలంక 19.3 ఓవర్లలో 116 పరుగులకు ఆలౌటైంది. ఇంగ్లండ్ బౌలర్లలో బెథెల్ 4, జాక్స్ 3 వికెట్లు పడగొట్టారు. సామ్ కరన్‌కు 'ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్', 'ప్లేయర్ ఆఫ్ ద సిరీస్' అవార్డులు దక్కాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్