ఫిఫా ప్రపంచకప్‌.. ఇంగ్లండ్ జట్టుకు చేదు అనుభవం

5080చూసినవారు
ఫిఫా ప్రపంచకప్‌.. ఇంగ్లండ్ జట్టుకు చేదు అనుభవం
ఫిఫా ప్రపంచకప్‌-2026లో పాల్గొనేందుకు అమెరికాకు వెళ్లిన ఇంగ్లండ్ జట్టుకు శిక్షణకు సంబంధించిన పలు జతల బూట్లు, పరికరాలు, మ్యాచ్ బాల్స్ భారీగా దొంగతనానికి గురయ్యాయి. ఫ్లోరిడాలోని వారి ప్రాక్టీస్‌ క్యాంప్‌ నుంచి మిస్సోరిలోని 'స్వోప్ సాకర్ విలేజ్‌కు' సామాగ్రిని తరలిస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. దొంగిలించబడిన వాటిలో ఇంగ్లండ్ కెప్టెన్ హ్యారీ కేన్, స్టార్ మిడ్‌ఫీల్డర్ జూడ్ బెల్లింగ్‌హామ్ వ్యక్తిగత మ్యాచ్ బూట్లు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై కాన్సాస్ పోలీసులు వేగంగా స్పందించి, ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్