ఫసిఫిక్ మహాసముద్రంలో ఎల్‌నినో ప్రభావం బలపడిందని భారత వాతావరణ శాఖ (IMD) ప్రకటించింది. ఆగస్టు నుంచి దీని ప్రభావం మరింత పెరిగి నైరుతి రుతుపవనాలపై ప్రభావం చూపే అవకాశం ఉందని హెచ్చరించింది. దీంతో దేశంలోని 197 జిల్లాల్లో వర్షపాతం తగ్గి కరువు పరిస్థితులు ఏర్పడే ప్రమాదం ఉందని కేంద్రం గుర్తించింది. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మాట్లాడుతూ, ప్రభావిత జిల్లాలకు ప్రత్యేక యాక్షన్ ప్లాన్ సిద్ధం చేశామని తెలిపారు. ఈ ఏడాది సాధారణ వర్షపాతంలో 90 శాతం మాత్రమే నమోదయ్యే అవకాశముందని అంచనా.