తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ సమీక్ష నిర్వహించారు. సెప్టెంబరు 24 నుంచి అక్టోబరు 2 వరకు శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఈ మేరకు పారిశుద్ధ్యానికి ప్రాధాన్యత ఇవ్వాలని ఈవో అధికారులకు సూచించారు. గ్యాలరీల్లోని భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అన్నప్రసాదాలు పంపిణీ చేసేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు.