ఈపీఎఫ్‌ గరిష్ఠ వేతన పరిమితి రూ.15 వేల నుంచి రూ.25 వేలకు పెంపు?

6493చూసినవారు
ఈపీఎఫ్‌ గరిష్ఠ వేతన పరిమితి రూ.15 వేల నుంచి రూ.25 వేలకు పెంపు?
కేంద్ర ప్రభుత్వం ఉద్యోగుల భవిష్య నిధి (ఈపీఎఫ్‌) గరిష్ఠ వేతన పరిమితిని రూ.15 వేల నుంచి రూ.25 వేలకు పెంచే అవకాశాలను పరిశీలిస్తోంది. ఈఎస్‌ఐ, ఈపీఎఫ్‌ పథకాల్లో ఒకే వేతన పరిమితిని అమలు చేయాలనే యోచనలో ఉంది. కార్మిక సంఘాల డిమాండ్లకు అనుగుణంగా ఈ నిర్ణయం త్వరలో తీసుకోనున్నట్లు సమాచారం. బడ్జెట్‌లో ఈ ప్రతిపాదన లేదంటే, త్వరలో జరిగే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీల సమావేశంలో కేంద్రం దీనిపై ప్రకటన చేసే అవకాశం ఉంది. కనీస పింఛనును రూ.1000 నుంచి రూ.2-3 వేలకు పెంచే ప్రతిపాదనలు కూడా కొలిక్కి వచ్చినట్లు తెలిసింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్