జెఫ్రీ ఎప్‌స్టీన్ లైంగిక కుంభకోణం బ్రిటన్‌లో సంచలనం రేపుతోంది. ఈ కుంభకోణంలో భాగస్వామిగా ఉన్న పీటర్ మాండెల్సన్‌ను అమెరికాకు రాయబారిగా నియమించడంపై బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఎప్‌స్టీన్ బాధితులకు క్షమాపణలు చెబుతూ, మాండెల్సన్ తనతో అబద్ధాలు చెప్పాడని, ఆయన మాటలు నమ్మి రాయబారిగా నియమించినట్లు స్టార్మర్ తెలిపారు. 2008లో ఎప్‌స్టీన్ దోషిగా తేలినప్పటికీ, మాండెల్సన్ ఆయనతో సన్నిహిత సంబంధాలు కొనసాగించినట్లు ఈమెయిల్స్, దస్త్రాలు వెలుగులోకి వచ్చాయి.