హైదరాబాద్‌లోని ఎర్రగడ్డ ఆస్పత్రి పరిధిలోని 1.31 ఎకరాలు, 1.20 ఎకరాల భూమి ప్రభుత్వానిదేనని హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ప్రైవేటు వ్యక్తులకు అనుకూలంగా కింది కోర్టు ఇచ్చిన డిక్రీని రద్దు చేసింది. రెండున్నర దశాబ్దాల క్రితం రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన అప్పీళ్లపై సుదీర్ఘ విచారణ అనంతరం హైకోర్టు ఈ తీర్పు ఇచ్చింది. కేవలం రెవెన్యూ రికార్డుల్లో మార్పుల ఆధారంగా భూములపై హక్కులు రావని, బలమైన ఆధారాలుండాలని స్పష్టం చేసింది. నిజాం నాటి లీజు పత్రం చట్టప్రకారం లేదని, కేవలం కాపీ ఆధారంగా హక్కులు పొందలేరని తేల్చి చెప్పింది.