AP: భూ రిజిస్ట్రేషన్లలో దొర్లిన లోపాల సవరణకు ప్రయత్నిస్తున్నామని మంత్రి ఎ.సత్యప్రసాద్ తెలిపారు. గత పాలకుల కబ్జాలు, ఆక్రమణల వల్ల ఈ సమస్యలు తలెత్తాయని, రియల్టర్ల అక్రమాలతో డబుల్ రిజిస్ట్రేషన్లు ఎక్కువగా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ప్రైవేటు భూముల అక్రమ రిజిస్ట్రేషన్ల రద్దు అధికారాన్ని కలెక్టర్లకు అప్పగించామని, తప్పు చేసిన వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. ఉద్యోగులపై పనిభారం తగ్గించడంపై అధ్యయనం చేస్తున్నామని కూడా మంత్రి తెలిపారు.