ఏరువాక పౌర్ణమి 2026.. రైతన్నల తొలి పండుగ ఇదే

12944చూసినవారు
ఏరువాక పౌర్ణమి 2026.. రైతన్నల తొలి పండుగ ఇదే
భారతదేశం వ్యవసాయ ఆధారిత దేశం కాబట్టి, ఇక్కడి సంస్కృతి, పండుగలు ప్రకృతితో, భూమాతతో ముడిపడి ఉంటాయి. వీటిలో అత్యంత ప్రాముఖ్యమైనది ఏరువాక పౌర్ణమి. జ్యేష్ఠ మాసంలో వచ్చే శుద్ధ పౌర్ణమిని ఏరువాక పౌర్ణమిగా జరుపుకుంటారు. రైతులు తమ వ్యవసాయ పనులను అధికారికంగా ప్రారంభించడానికి ఈ రోజును అత్యంత శుభప్రదమైనదిగా భావిస్తారు. ఏరు అంటే నాగలి సాగే దారి లేదా నీటి ప్రవాహం, వాక అంటే ప్రారంభం. అంటే నాగలిని భూమిలో దించి వ్యవసాయాన్ని మొదలుపెట్టే రోజే ఈ ఏరువాక పౌర్ణమి.

సంబంధిత పోస్ట్