సాధారణ సాకెట్లతో ఈవీ ఛార్జింగ్.. అగ్ని ప్రమాదాల ముప్పు!

8173చూసినవారు
సాధారణ సాకెట్లతో ఈవీ ఛార్జింగ్.. అగ్ని ప్రమాదాల ముప్పు!
అలయన్స్ ఫర్ యాన్ ఎనర్జీ ఎఫిషియంట్ ఎకానమీ నివేదిక ప్రకారం, చాలామంది తమ ఇళ్లలోని సాధారణ సాకెట్లు లేదా ఎక్స్‌టెన్షన్ బోర్డుల ద్వారా ఈవీలను ఛార్జ్ చేస్తున్నారు. ఇది భవిష్యత్తులో అగ్ని ప్రమాదాలకు దారితీసే అవకాశం ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈవీని కొన్న ప్రతి ఒక్కరూ ఇంటి వైరింగ్ సరిగ్గా ఉందో లేదో ఎలక్ట్రీషియన్ ద్వారా పరీక్షించుకోవాలి. ఎక్కువ విద్యుత్ సామర్థ్యం అవసరమైనప్పుడు ప్రత్యేకమైన ఛార్జింగ్ పాయింట్లను ఏర్పాటు చేసుకోవడం ఉత్తమం.

సంబంధిత పోస్ట్