నంజుండేశ్వర ఆలయానికి వెళ్తే దీర్ఘకాలిక మొండి రోగాలైనా నయం!

6998చూసినవారు
నంజుండేశ్వర ఆలయానికి వెళ్తే దీర్ఘకాలిక మొండి రోగాలైనా నయం!
కర్ణాటకలోని మైసూరు సమీపంలో ఉన్న నంజున్గఢ్ జిల్లాలో దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన నంజుండేశ్వర ఆలయం ఉంది. ఇక్కడి శివుడిని శ్రీకంఠీశ్వరుడు అని పిలుస్తారు. ఆలయ శిలాఫలకాల ప్రకారం, గౌతమ మహర్షి ఈ శివలింగాన్ని ప్రతిష్టించారు. 'నంజ' అంటే విషం, 'నంజుంద' అంటే విషాన్ని స్వీకరించినవాడు అని కన్నడ అర్థం. సాగర మధనం సమయంలో వెలువడిన విషాన్ని శివుడు తాగి, గొంతులోనే నిల్వ చేసుకోవడంతో ఆయన కంఠం నీలంగా మారి, నీలకంఠేశ్వరుడిగా పిలుస్తారు. ఈ ఆలయంలో శివుడిని దర్శించుకుంటే ఎలాంటి రోగాలైనా నయమవుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం.

ఇలాంటి మరెన్నో ఆలయ విశేషాలను ప్రతి రోజూ సాయంత్రం 5 గంటలకు #Hidden Secrets of Telugu Temples ద్వారా తెలుసుకోండి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్