AP: రంగు మారిన, తడిచిన పత్తినీ కొనేలా చూడాలని చంద్రబాబు స్పష్టం చేశారు. ‘పత్తి కొనుగోళ్లలో రైతులకు ఎలాంటి నష్టం జరిగినా సహించేది లేదు. కొనుగోలు కేంద్రాల్ని రోజూ తనిఖీ చేయండి. రైతులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకోండి. సమీపంలోని జిన్నింగ్ మిల్లులకే పత్తిని రవాణా చేసేలా చర్యలు చేపట్టండి. కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నిబంధనలతో పత్తి రైతు నష్టపోకూడదు’ అని సీఎం నిర్దేశించారు.