రైతులు ఆత్మహత్య చేసుకున్నా కనీస పరామర్శ లేదు: జగన్

28చూసినవారు
రైతులు ఆత్మహత్య చేసుకున్నా కనీస పరామర్శ లేదు: జగన్
AP: కూటమి ప్రభుత్వంపై వైఎస్ జగన్ ఫైర్ అయ్యారు. దేవరపల్లి పర్యటనలో జగన్ మాట్లాడుతూ.. 'నా కళ్ల ఎదుటే బుట్టాయిగూడెం మండలానికి చెందిన వెంకటేశ్వరరావు కుటుంబం నిలబడి ఉందని, పది ఎకరాల్లో సాగు చేసి, గిట్టుబాటు ధర రాక, పంటను అమ్ముకోలేక ఆ రైతు ఆత్మహత్య చేసుకున్నాడని' తెలిపారు. ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి ఒక్క ఎంపీ, ఎమ్మెల్యే, మంత్రి కానీ వెళ్లలేదన్నారు. రైతులు నష్టపోతున్నా కనీసం పరామర్శ కూడా చేయని ప్రభుత్వం ఇది అని ఆయన విమర్శించారు.

సంబంధిత పోస్ట్