తుఫాను వల్ల ఇద్దరు చనిపోయినా.. ప్రభుత్వం దాచింది: దాడిశెట్టి(వీడియో)

18చూసినవారు
AP: తుఫాను వల్ల కాకినాడలో ఇద్దరు చనిపోయారని మాజీ మంత్రి దాడిశెట్టి రాజా తెలిపారు. ఆ మరణాలను ప్రభుత్వం దాచేసిందని ధ్వజమెత్తారు. వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డితో జరిగిన వీడియో కాన్ఫరెన్సులో ఆయన ఈ విషయం వెల్లడించారు. జిల్లాలో 40 వేల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని వివరించారు. అటు వరద బాధితులకు అందుబాటులో ఉంటున్నామని ఆ పార్టీ సీనియర్ నేత కన్నబాబు తెలిపారు. రైతుల తర్వాత తమ ప్రాంతంలో మత్స్యకారులే తీవ్రంగా నష్టపోయారని జగన్ కు వివరించారు.