AP: ప్రతి అధికారి నిబంధనలకు లోబడి పని చేయాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. విశాఖ పర్యటనలో భాగంగా పంచాయతీ రాజ్ శాఖ మీద పూర్తి స్థాయి సమీక్ష చేస్తూ పవన్ ఈ వ్యాఖ్యలు చేశారు. 'నాకు పొగడ్తలు కాదు పని కావాలి. నా వైపు నుంచి ఎలాంటి రాజకీయ ఒత్తిడులు, సిఫార్సులు రావు. కొందరు అధికారులు గత ప్రభుత్వ నాయకులతో సంబంధాలు కొనసాగిస్తూ ప్రభుత్వ పాలసీల అమలులో నిర్లక్ష్యం వహిస్తున్నారు. పనిలో అలసత్వాన్ని అస్సలు సహించం' అని పవన్ హెచ్చరించారు.