’మీ చరిత్ర అందరికీ తెలిసిందే’.. పాక్‌కు భారత్‌ చురకలు

5030చూసినవారు
’మీ చరిత్ర అందరికీ తెలిసిందే’.. పాక్‌కు భారత్‌ చురకలు
బలోచిస్థాన్‌ ఘటనల్లో భారత్‌ ప్రమేయం ఉందని పాకిస్థాన్‌ చేసిన ఆరోపణలను భారత విదేశాంగశాఖ తీవ్రంగా ఖండించింది. ఇది పాకిస్థాన్‌ అంతర్గత వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు చేసే సాధారణ వ్యూహమని విదేశాంగశాఖ అధికార ప్రతినిధి రణధీర్‌ జయస్‌వాల్‌ పేర్కొన్నారు. హింసాత్మక ఘటనలు జరిగినప్పుడు పనికిమాలిన వాదనలు చేసే బదులు, ఆ ప్రాంత ప్రజల దీర్ఘకాలిక డిమాండ్లను పరిష్కరించడంపై దృష్టి పెట్టాలని సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్