ఆంధ్రప్రదేశ్‌లో ఏ పని జరగాలన్నా డబ్బు చెల్లిస్తేనే జరుగుతుందని, ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్‌కు కట్టబెడుతున్నారని
వైసీపీ మాజీ మంత్రి పేర్ని నాని విమర్శించారు. విజయవాడలో జరిగిన అభివృద్ధి వికేంద్రీకరణ చర్చా వేదికలో ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు, లోకేష్ కనుసన్నల్లోనే పనిచేస్తున్నారని, మెడికల్ కాలేజీలు, విద్యుత్ సంస్థలు, ఆర్టీసీ డిపోలను ప్రైవేట్‌కు అప్పగిస్తున్నారని ఆరోపించారు. జీతాలకే డబ్బులు లేవని చంద్రబాబు చెబుతున్నా, రూ. 3.95 లక్షల కోట్ల అప్పులు తెచ్చి, ప్రజల సొమ్మును దోచుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.