మే 27, 28 తేదీల్లో టీడీపీ సరికొత్త మహానాడుకు సర్వం సిద్ధం: పల్లా శ్రీనివాసరావు

21చూసినవారు
మే 27, 28 తేదీల్లో టీడీపీ సరికొత్త మహానాడుకు సర్వం సిద్ధం: పల్లా శ్రీనివాసరావు
తెలుగుదేశం పార్టీ ప్రతి ఏటా నిర్వహించే 'మహానాడు' ఈసారి సరికొత్త రూపంలో జరగనుంది. మే 27, 28 తేదీల్లో 'హైబ్రిడ్ మహానాడు' నిర్వహించనున్నట్లు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ప్రకటించారు. మంగళగిరిలోని ఎన్టీఆర్ భవన్ కేంద్ర కార్యాలయం నుండి రాష్ట్రవ్యాప్తంగా 1,848 క్లస్టర్లకు డిజిటల్ సాంకేతికత ద్వారా అనుసంధానించి, లక్షలాది మంది కార్యకర్తలను భాగస్వాములను చేయనున్నారు. 'స్త్రీశక్తి'ని ప్రధాన ఇతివృత్తంగా తీసుకుని ఈ మహానాడు నిర్వహిస్తున్నారు.

సంబంధిత పోస్ట్