AP: అనకాపల్లి జిల్లాలో బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ (బార్క్)ను విస్తరించాలని సంస్థ నిర్ణయించింది. అనకాపల్లి జిల్లాలో ఇప్పటికే 3 వేల ఎకరాల్లో ఉన్న తమ పరిశోధన, అభివృద్ధి ప్రాంగణాన్ని విస్తరించాలని బార్క్ భావిస్తోంది. ఇందుకోసం 366 ఎకరాల భూమి కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని సంస్థ కోరింది. కొత్త ప్రాంగణాన్ని విశాఖపట్నం సమీపంలోని తూర్పు తీరంలో బార్క్ ఏర్పాటు చేస్తోంది.