పాత షూస్‌ను కూడా కొత్తవాటిలా మెరిపించేందుకు నిపుణులు పలు పద్ధతులను సూచిస్తున్నారు. షూస్‌ను మెషీన్‌లో ఉతికే ముందు మట్టిని దులిపి, లేసులను తీసివేయాలి. మొండి మరకలకు వైట్ వెనిగర్ లేదా బేకింగ్ సోడా మిశ్రమాన్ని వాడాలి. షూస్ పాడవకుండా మెష్ బ్యాగ్ లేదా దిండు గల్లాలో ఉంచి, చల్లని నీటితో 'డెలికేట్' మోడ్‌లో ఉతకాలి. డ్రైయర్‌లో కాకుండా, పాత వార్తాపత్రికలు కుక్కి నీడలో ఆరబెట్టాలి. లెదర్, సింథటిక్ షూస్‌ను చేత్తో శుభ్రం చేయడం మంచిది. సరైన పద్ధతులతో పాదరక్షలను శుభ్రంగా ఉంచుకోవచ్చు.