శరీరానికి శక్తినిచ్చే ఆహారం రక్తంలో చక్కెర స్థాయిలను కూడా నిర్ణయిస్తుంది. అలసట, ఆకలి, చిరాకు వంటి సమస్యలు రాకుండా ఉండాలంటే, రోజువారీ జీవితంలో కొన్ని సాధారణ అలవాట్లు పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు. సమతుల ఆహారం, తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న ఆహారాలు, సరైన భోజన సమయాలు, వ్యాయామం, తగినంత నిద్ర, ఆహార పరిమాణంపై నియంత్రణ, తరచూ రక్తంలో చక్కెర స్థాయిలను పరీక్షించుకోవడం వంటివి పాటించడం ద్వారా బ్లడ్ షుగర్‌ను రోజంతా స్థిరంగా ఉంచుకోవచ్చని తెలిపారు.