ఒక ఉత్పత్తి ఎప్పటి వరకు సురక్షితం? ఏ తేదీ దాటితే దాని నాణ్యత తగ్గుతుంది? అనే విషయాలపై స్పష్టత ఉండాలి. ఎక్స్‌పైరీ డేట్ అనేది భద్రతకు సంబంధించింది, ఆ తేదీ దాటిన తర్వాత ఆ ఉత్పత్తిని అస్సలు ఉపయోగించకూడదు. ముఖ్యంగా మందులు, పాలు, మాంసం వంటి ఉత్పత్తుల విషయంలో ఇది చాలా కీలకం. బెస్ట్ బిఫోర్ అనేది ఆ వస్తువు రుచి, రంగు తాజాదనానికి సంబంధించింది. ఈ తేదీ దాటిన తర్వాత కూడా వస్తువు సురక్షితంగా ఉండవచ్చు, కానీ దాని రుచి కొద్దిగా మారవచ్చు లేదా తాజాదనం తగ్గవచ్చు. ఎప్పుడైనా సరే ‘ఎక్స్‌పైరీ డేట్’ ముగిసిన వస్తువులను వాడటం ఏమాత్రం సురక్షితం కాదు. ‘బెస్ట్ బిఫోర్’ విషయంలో, ఆ వస్తువును వాసన చూసి లేదా రుచి చూసి అది పాడవలేదని నిర్ధారించుకున్న తర్వాతే వాడటం మంచిది.