చండీగఢ్‌లోని భారతీయ జనతా పార్టీ (బీజేపీ) కార్యాలయం వద్ద పార్కింగ్‌లో ఉన్న స్కూటీలో పేలుడు సంభవించింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు, ఫోరెన్సిక్ బృందాలు వెంటనే ఘటనాస్థలికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించాయి. పేలుడుకు గల కారణాలపై అధికారులు ఆరా తీస్తున్నారు.