AP: అనకాపల్లి జిల్లాలో ఉపాధి పనులు చేస్తుండగా పేలుడు సంభవించి తుంపాల నరసమ్మ అనే 46 ఏళ్ల మహిళా కూలీ గాయపడ్డారు. చెరువులో పూడిక తీస్తుండగా జరిగిన ఈ ఘటనలో ఆమె కంటికి తీవ్ర గాయమైంది. ఇది పందుల వేట కోసం పెట్టిన నాటు బాంబుగా అనుమానిస్తున్నామని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. ఈ ఘటనతో స్థానికంగా కలకలం రేగింది.