కర్ణాటకలోని బీదర్ జిల్లాలో శనివారం మొలిగే మారయ్య ఆలయం సమీపంలో భూమిలో పాతిపెట్టిన వస్తువు పేలడంతో ముగ్గురు చిన్నారులతో సహా 8 మందికి తీవ్ర గాయాలయ్యాయి. మెరుగైన వైద్యం కోసం క్షతగాత్రులను హైదరాబాద్‌కు తరలించారు. ఈ ఘటనపై కర్నాటక ప్రభుత్వం ఉన్నతస్థాయి దర్యాప్తుకు ఆదేశించింది. ఆరు నెలల్లో ఐదోసారి ఈ ప్రాంతంలో పేలుళ్లు జరగడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. పేలుడుకు కారణం, దీని వెనుక ఏదైనా కుట్ర కోణం ఉందా అనే దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.