వేట్లపాలెంలో పేలుడు ఘటన.. 25కి చేరిన మృతుల సంఖ్య

22చూసినవారు
వేట్లపాలెంలో పేలుడు ఘటన.. 25కి చేరిన మృతుల సంఖ్య
AP: కాకినాడలోని వేట్లపాలెం బాణసంచా తయారీ కేంద్రంలో జరిగిన పేలుడు ప్రమాదంలో మరొకరు మరణించారు. బుధవారం కాకినాడ జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్న వీర శ్రీను (39) మరణించడంతో, ఈ దుర్ఘటనలో మృతుల సంఖ్య 25కు చేరుకుంది. మంగళవారం లోవరాజు అనే వ్యక్తి ఇదే ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించిన విషయం తెలిసిందే. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మిగిలిన ఐదుగురు క్షతగాత్రులకు వైద్య సేవలు కొనసాగుతున్నాయి, వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్