కేరళలోని పాలక్కాడ్ పట్టణ సమీపంలో బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత పోలీసులు అనుమానాస్పద పికప్ వ్యాన్‌ను తనిఖీ చేశారు. ఈ తనిఖీలో భాగంగా పుచ్చకాయల లోడ్ కింద దాచిన వందకు పైగా జిలెటిన్ స్టిక్స్, 20కి పైగా డిటోనేటర్ల పెట్టెలు లభ్యమయ్యాయి. ఈ ఘటనతో తీవ్ర కలకలం రేగింది. వ్యాన్ డ్రైవర్‌తో పాటు మరో వ్యక్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. పేలుడు పదార్థాల తరలింపు వెనుక ఉన్న కుట్ర, సరఫరా కోణాలపై విచారణ జరుపుతున్నారు. ఉగ్రవాద కోణాలు ఏమైనా ఉన్నాయా అనే దిశగా కూడా దర్యాప్తు జరుగుతోంది.