మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో ఒక దారుణ ఘటన చోటుచేసుకుంది. భర్తను వదిలి గ్రామంలోని ఓ యువకుడితో వివాహేతర సంబంధం పెట్టుకుని సహజీవనం చేస్తున్న మహిళపై, ఆ యువకుడి కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళను నగ్నంగా నడివీధిలో ఊరేగిస్తూ, మెడలో చెప్పుల దండ వేసి వేధించారు. ఈ ఘటనపై పోలీసులకు సమాచారం అందడంతో, ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు.