ఏపీలోని ఈ మండలాల్లో తీవ్ర వడగాల్పులు..

11చూసినవారు
ఏపీలోని ఈ మండలాల్లో తీవ్ర వడగాల్పులు..
AP: రాష్ట్రవ్యాప్తంగా 8 మండలాల్లో తీవ్ర వడగాల్పులు వీచే అవకాశం ఉందని  ఏపీ విపత్తుల నిర్వహణ  సంస్థ  గురువారం హెచ్చరించింది. రాయలసీమ జిల్లాలలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ సూచించారు. గురువారం కడప జిల్లా పొట్టిపాడులో 40.7 డిగ్రీలు, కర్నూలు జిల్లా లద్దగిరిలో 39.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు తెలిపారు. శుక్రవారం నాటికి రాష్ట్రవ్యాప్తంగా 58 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని అంచనా వేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్