AP: ఉత్తరాంధ్రకు వాతావరణశాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండం బలపడుతోంది. మంగళవారం సాయంత్రంలోపు తీవ్ర వాయుగుండంగా మారే అవకాశముంది. విశాఖ, శ్రీకాకుళం జిల్లాల్లో తీరం దాటే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ పేర్కొంది. దీని ప్రభావంతో ఉత్తరాంధ్రలో అత్యంత భారీ వర్షాల కురిసే అవకాశం ఉంది. ప్రధాన పోర్టుల్లో మూడో నంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు.