ఉపాధి హామీ పథకం కూలీలకు ఫేస్ రికగ్నిషన్ అటెండెన్స్

35చూసినవారు
ఉపాధి హామీ పథకం కూలీలకు ఫేస్ రికగ్నిషన్ అటెండెన్స్
ఉపాధి కూలీల హాజరు నమోదు కోసం కేంద్ర ప్రభుత్వం ఫేస్ రికగ్నిషన్ విధానం తీసుకొస్తోంది. దొంగ మస్టర్లను అరికట్టేందుకు ఇవాళ దేశవ్యాప్తంగా ప్రయోగాత్మకంగా మూడు జిల్లాల్లో అమలు చేయనున్నారు. ఇందులో ఆంధ్రప్రదేశ్‌లో మన్యం జిల్లా కూడా ఒకటి. పని ప్రాంతం 10 మీటర్ల పరిధిలో ఉండగానే హాజరు నమోదు చేయాలి. ప్రతి 4 గంటల వ్యవధిలో రెండు సార్లు హాజరు తప్పనిసరి. కాగా, వచ్చే రెండు–మూడు నెలల్లో దేశవ్యాప్తంగా ఈ విధానం అమలయ్యే అవకాశం ఉంది.

సంబంధిత పోస్ట్