భారీ రెమ్యునరేషన్‌తో హాట్ టాపిక్‌గా మారిన ఫహద్ ఫాజిల్

3971చూసినవారు
భారీ రెమ్యునరేషన్‌తో హాట్ టాపిక్‌గా మారిన  ఫహద్ ఫాజిల్
పుష్ప చిత్రం తర్వాత టాలీవుడ్‌లో ఫహద్ ఫాజిల్ కు విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. అయితే, ఆయన విలన్‌గా నటించడానికి రూ. 15-20 కోట్లు డిమాండ్ చేస్తుండటంతో నిర్మాతలు వెనుకంజ వేస్తున్నారని టాక్. అనిల్ రావిపూడి తన సినిమాలో ఫహద్‌ను తీసుకోవాలనుకున్నా, అధిక పారితోషికం కారణంగా కల్యాణ్‌ రామ్‌ను తీసుకున్నారని వార్తలు వస్తున్నాయి. రామ్ సినిమాలోనూ ఇదే పరిస్థితి ఎదురైందని తెలుస్తోంది. తనకు నచ్చని పాత్రలకు కూడా భారీ రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తూ ఫహద్ టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్