TG: హైదరాబాద్‌లోని ఫిర్జాదిగూఢలో బుధవారం రాత్రి జ్వరంతో బాధపడుతున్న పి.ఎల్లం (56) అనే వ్యక్తి ఆర్ఎంపీ వైద్యుడు లునావత్ రూప్ సింగ్ దగ్గరికి వెళ్లాడు. ఇంజెక్షన్ ఇవ్వడంతో నురగలు కక్కుకుని మరణించాడు. పోలీసులు రూప్ సింగ్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా.. అతనికి వైద్య అర్హతలు లేదని తేలింది. అతన్ని రిమాండ్‌కు తరలించారు. తెలంగాణలో నకిలీ వైద్యుల వల్ల గతంలోనూ పలువురు మరణించిన సంఘటనలున్నాయి. ప్రజలు వైద్య శాఖ క్షేత్ర స్థాయిలో తనిఖీలు నిర్వహించి, నకిలీ వైద్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.