విజయవాడలో నకిలీ ఇంజన్ ఆయిల్ దందా!

4657చూసినవారు
విజయవాడలో నకిలీ ఇంజన్ ఆయిల్ దందా!
విజయవాడ ఆటోనగర్ కేంద్రంగా నకిలీ ఇంజన్ ఆయిల్ దందా నడుస్తుందని వాహనదారులు ఆందోళనకు గురవుతున్నారు. వాడిన ఇంజన్ ఆయిల్‌ను రీసైకిల్ చేసి, ప్రముఖ కంపెనీల బ్రాండ్ల పేర్లతో మార్కెట్లోకి పంపిస్తున్నారన్న ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. ఈ నకిలీ ఆయిల్ వల్ల ఇంజన్ జీవితకాలం తగ్గిపోవడం, ఇంజన్ వేడెక్కడం, పిస్టన్ సమస్యలు, మైలేజ్ తగ్గడం, భారీ మరమ్మత్తులు తప్పవని మెకానిక్‌లు చెబుతున్నారు. వాహనదారులు లీటర్‌కు రూ.300 నుంచి రూ.700 వరకు చెల్లిస్తున్నా నాణ్యతపై హామీ లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తనిఖీలు నిర్వహించి కఠిన చర్యలు తీసుకోవాలని వాహనదారులు కోరుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్