నకిలీ మద్యం కేసు.. జోగి రమేష్‌కు బిగుస్తున్న ఉచ్చు

58చూసినవారు
నకిలీ మద్యం కేసు.. జోగి రమేష్‌కు బిగుస్తున్న ఉచ్చు
AP: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన నకిలీ మద్యం కేసులో వైసీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేష్‌కు ఉచ్చు బిగుస్తోంది. మద్యం కేసులో కస్టడీ విచారణలో ఉన్న నిందితుడు జనార్ధనరావు, మాజీ మంత్రి జోగి రమేష్ ప్రోద్బలంతోనే నకిలీ మద్యం తయారు చేసినట్లు స్టేట్‌మెంట్‌ ఇచ్చినట్లు ఎక్సైజ్ పోలీసులు తెలిపారు. జనార్ధన్ స్టేట్‌మెంట్‌ను ఎక్సైజ్ పోలీసులు రికార్డు చేశారు. దీంతో జోగి రమేష్‌కు ఈ కేసులో నిందితుడిగా చేర్చారు. త్వరలోనే జోగి రమేష్‌ను కూడా విచారించనున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్