నకిిలీ మద్యం వ్యవహారం.. ఏడుగురిపై కేసు నమోదు

21చూసినవారు
నకిిలీ మద్యం వ్యవహారం.. ఏడుగురిపై కేసు నమోదు
AP: అన్నమయ్య జిల్లా ములకలచెరువు నకిలీ మద్యం వ్యవహారంలో ఎక్సైజ్ అధికారులు  తంబళ్లపలె కోర్టులో మెమో దాఖలు చేశారు. ఈ కేసులో మరో ఏడుగురిని నిందితులుగా చేర్చారు. టీడీపీ నుంచి సస్పెండ్ అయిన జయచంద్రారెడ్డిని ఏ17గా, ఆయన బావమరిది గిరిధర్ రెడ్డి ఏ18గా చేర్చారు. మరో ఐదుగురు అన్బురాసు, బాలాజీ, రవి, అష్రఫ్, సుదర్శన్‌పై కేసు నమోదు చేశారు. దాంతో ఇప్పటివరకు మొత్తం 21 మందిపై కేసు నమోదు చేశారు. ప్రధాన నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్