నకిలీ మద్యం కేసు: జోగి రమేష్, సోదరుడికి 14 రోజుల రిమాండ్

238చూసినవారు
నకిలీ మద్యం కేసు: జోగి రమేష్, సోదరుడికి 14 రోజుల రిమాండ్
నకిలీ మద్యం కేసులో నిందితులుగా ఉన్న మాజీ మంత్రి జోగి రమేష్, ఆయన సోదరుడు జోగి రాములను ఎక్సైజ్ పోలీసులు తంబళ్లపల్లి కోర్టులో హాజరుపరిచారు. పీటీ వారెంట్‌పై నెల్లూరు జైలు నుంచి తీసుకొచ్చిన వీరిద్దరికీ న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో వారిని తిరిగి నెల్లూరు జైలుకు తరలించారు. ఈ కేసులో జోగి రమేష్ 32వ నిందితుడిగా, జోగి రాము 33వ నిందితుడిగా ఉన్నారు. వీరిని కోర్టుకు తీసుకొచ్చినప్పుడు వైసీపీ నేతలు పూలు జల్లుతూ నినాదాలు చేశారు.

సంబంధిత పోస్ట్