నకిలీ మద్యం కేసు.. మాజీ మంత్రి జోగి రమేష్ అరెస్ట్‌కు రంగం సిద్ధం

35చూసినవారు
నకిలీ మద్యం కేసు.. మాజీ మంత్రి జోగి రమేష్ అరెస్ట్‌కు రంగం సిద్ధం
AP: నకిలీ మద్యం కేసులో మాజీ మంత్రి, వైసీపీ నేత జోగి రమేష్ అరెస్ట్‌కు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలోని ఆయన ఇంటికి సిట్, ఎక్సైజ్ అధికారులు చేరుకున్నారు. జోగి రమేష్‌తో పాటు సోదరుడు రామును కూడా అరెస్ట్ చేసే అవకాశాలున్నాయి. ఈ కేసులో ఏ1గా ఉన్న జనార్దన్‌రావు.. జోగి రమేష్ ప్రోద్బలంతోనే నకిలీ మద్యం విక్రయాలు చేసినట్లు వాంగ్మూలం ఇచ్చినట్లు సమాచారం.

సంబంధిత పోస్ట్