నకిలీ మద్యం తయారీ కేసు.. వెలుగులోకి కీలక విషయాలు

102చూసినవారు
నకిలీ మద్యం తయారీ కేసు.. వెలుగులోకి కీలక విషయాలు
AP: అన్నమయ్య జిల్లా ములకలచెరువులో వెలుగుచూసిన నకిలీ మద్యం తయారీ వ్యవహారానికి సంబంధించిన కీలక విషయాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. ఈ కేసులో ఇప్పటికే పలువురిని పోలీసులు అరెస్ట్ చేయగా.. వారిచ్చిన వివరాలు ఆధారంగా మరికొందరి ప్రమేయం కూడా వెల్లడవుతోంది. ఈ క్రమంలో ములకలచెరువు ప్రాంతానికి చెందిన గిరిధర్ రెడ్డి అనే వ్యక్తి పేరు తెరపైకి వచ్చింది. నకిలీ మద్యం అమ్మకాల్లో ఆయన కీలకంగా వ్యవహరించారని తెలిసింది.

ట్యాగ్స్ :