నకిలీ మద్యం.. తప్పుడు కథనాలను సహించబోం: కొల్లు రవీంద్ర

33చూసినవారు
నకిలీ మద్యం.. తప్పుడు కథనాలను సహించబోం: కొల్లు రవీంద్ర
AP: అమరావతిలో నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ, నకిలీ మద్యంపై విష ప్రచారానికి వైసీపీ అధినేత జగన్ పూనుకున్నారని విమర్శించారు. సొంత మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తూ, సోషల్ మీడియాలోనూ అసత్య కథనాలను ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే తప్పుడు కథనాలపై ప్రభుత్వం సీరియస్‌గా ఉందని, విచారణ జరిపి నిజానిజాలు నిగ్గు తేలుస్తామని, ఆధారాలు లేకుండా ప్రచారం చేస్తే తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్