AP: ఈ నెల 21న శాంతియుత ర్యాలీ చేస్తామని సీపీకి
వైసీపీ నేతలు లేఖ ఇచ్చారని
వైసీపీ అధినేత
జగన్ అన్నారు. విజయవాడలో
జగన్ మాట్లాడుతూ.. ‘చంద్రబాబు,
లోకేశ్ కుట్రలు పన్ని.. ఫేక్ టీచర్లతో ఇంకో ధర్నా చేయించారు. వీళ్లతో పాటు
టీడీపీ గూండాలను తీసుకొచ్చారు. దాడి చేసిన
టీడీపీ గూండాలపై మాత్రం కేసులు పెట్టరు. తిరిగి శాంతియుత ర్యాలీ చేసిన యువతపైనే కేసులు పెట్టారు. 350 మందిపై తప్పుడు కేసులు పెట్టారు’ అని మండిపడ్డారు.